రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే.. సీఎం హామీతో విరమణ

ABN , First Publish Date - 2022-02-25T18:32:48+05:30 IST

తన తండ్రిపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోని పోలీసుల్ని ట్రాన్స్‌ఫర్ చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే వెనక్కు తగ్గారు. గుజరాత్‌లోని మఠార్ నియోజకవర్గానికి కేశ్రిసింఘ్ సోలంకి ఎమ్యెల్యేగా ఉన్నారు.

రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే.. సీఎం హామీతో విరమణ

తన తండ్రిపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోని పోలీసుల్ని ట్రాన్స్‌ఫర్ చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే వెనక్కు తగ్గారు. గుజరాత్‌లోని మఠార్ నియోజకవర్గానికి కేశ్రిసింఘ్ సోలంకి ఎమ్యెల్యేగా ఉన్నారు. ఈ నెల 8న సోలంకి తండ్రిపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితుల్ని పట్టుకోలేదు. ఎమ్మెల్యే చొరవతో ఒక నిందితుడ్ని పట్టుకున్నా, తర్వాత వదిలేశారు. దీంతో నిందితులు స్వేఛ్చగా బయట తిరుగుతున్నారని, వారిపై చర్య తీసుకోవడంలో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ నిర్లక్ష్యం వహిస్తున్నారని సోలంకి ఆరోపించారు.


నిందితులకు పోలీసులు అమ్ముడుపోయారని విమర్శించాడు. దీనికి బాధ్యుడైన జిల్లా ఎస్పీ అర్పితా పటేల్‌తోపాటు, మరో ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సోలంకి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో స్పందించిన గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, ఎమ్మెల్యే సోలంకితో గురువారం మాట్లాడారు. ఈ విషయంలో న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

Updated Date - 2022-02-25T18:32:48+05:30 IST