కొవిడ్‌ సేవలందించిన వైద్యులకు సత్కారం

ABN , First Publish Date - 2022-06-30T05:26:24+05:30 IST

కొవిడ్‌ బాధితులకు ఆదరణతో సేవలందించిన పలువురు డాక్టర్లను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బుధవారం సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.

కొవిడ్‌ సేవలందించిన వైద్యులకు సత్కారం
వైద్యులను సత్కరించిన ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లుఅర్బన్‌, జూన్‌ 29 : కొవిడ్‌ బాధితులకు ఆదరణతో సేవలందించిన పలువురు డాక్టర్లను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బుధవారం సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. కొవిడ్‌ సమయంలో బెడ్స్‌, ఆక్సిజన్‌, మందులు అందు బాటులో లేక ఎంతో మంది ఇబ్బంది పడినా వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది అందించిన సేవలు అపూర్వం అన్నారు. వారిని ప్రోత్సహించాలని చిరు సత్కారం అని రామానాయుడు తెలిపారు. టీడీపీ నాయకులు పెచ్చెట్టి బాబు, దీప్తి అప్పారావు, ముచ్చర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:26:24+05:30 IST