ఏలూరికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

ABN , First Publish Date - 2021-01-27T04:45:46+05:30 IST

శాసనసభ్యులు, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు జన్మదిన వేడుకలను మంగళవారం మండలంలోని పార్టీ నాయకులు ఘ నంగా నిర్వహించారు.

ఏలూరికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు


మార్టూరు, జనవరి 26 : శాసనసభ్యులు, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు జన్మదిన వేడుకలను మంగళవారం మండలంలోని పార్టీ నాయకులు ఘ నంగా నిర్వహించారు. ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో కే క్‌ కట్‌ చేశారు. నాయకులు తొండెపు ఆదినారాయణ, కోటపాటి సురే ష్‌, కామేపల్లి హరిబాబు, మిన్నెకంటి రవి, జాగర్లమూడి శ్రీనివాసరా వు, శివరాత్రి శ్రీను, శానంపూడి చిరంజీవి, తేలప్రోలు సాంబశివరావు, అడుసుమల్లి శ్రీనాగహర్ష, తాళ్లూరి మార్తా శ్రీను, మువ్వా ఆంజనేయులు, రావిపాటి సీతయ్య, అడుసుమల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శానిటైజర్లు పంపిణీ

శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పుట్టినరోజు సందర్భంగా  వలపర్లకు చెందిన తెలుగు యువత నాయకులు కొమ్మి మహేష్‌ శానిటైజర్లు, ఫ్లోర్‌ క్లీనర్స్‌ను పంపిణీ చేశారు. మార్టూరులో అమ్మ ఆశ్రమంలో, శాంతినికేతన్‌ అనాఽథ బాలికల ఆశ్రమంలో వృద్ధులకు వాటిని పంపిణీ చేశారు. అనంతరం వారికి అన్నదానం చేశారు.

లండన్‌, అమెరికాలోనూ వేడుకలు

పర్చూరు, జనవరి 26 : శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు ఏలూరికి పెద్ద ఎత్తున ఆశీస్సులు అందజేశారు. పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, యద్దనపూడి, మార్టూరు, చినగంజాం మండలాల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పర్చూరు బొమ్మల సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌చేశారు. అధినేత చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, మాజీ మంత్రి నక్కా అనంద్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంతో పాటు బాపట్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేడుకలు జరిగాయి. బాపట్లలో నిరుపేదకు రిక్షాను అందజేశారు. ఏలూరి జన్మదిన వేడుకలను రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు అమెరికా, లండన్‌, ఆస్ర్టేలియాల్లో సైతం నిర్వహించారు.

ఉత్సాహ భరితంగా డబుల్‌ వికెట్‌ టోర్నమెంట్‌

ఏలూరి జన్మదినం సందర్భంగా వ్యాపారవేత్త విన్నకోట రవి ఆధ్వర్యంలో డబుల్‌ వికెట్‌ టోర్నమెంట్‌ ఉత్సాహ ంగా సాగింది. మొదటి బహుమతి రూ.5000ను పర్చూరు ఏఏటీ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. రెండో బహుమతి రూ.3000ను ధోని టీం, మూడో బహుమతి నూతలపాడుకు చెందిన క్రీడాకారులు రూ.2000ను సొంతం చేసుకున్నారు. టీడీపీ నాయకులు వెంకటకృష్ణారావు, ఆకుల శ్రీనివాసరావు, షంషుద్దీన్‌, గ్రంధి వెంకటరమణ, చింపయ్య, నిర్వాహకులు తులసి శ్రీనివాసరావు, తేజ, దాసరి శ్రీధర్‌, బషీర్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-27T04:45:46+05:30 IST