మహబూబాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్, ముత్యాల సాగర్ బలవన్మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక, ఉద్యోగం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సాగర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం కొనసాగిందన్నారు. గత ఏడేళ్లలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదన్నారు. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ లేదని ఈటల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి