Abn logo
Oct 18 2021 @ 00:57AM

చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 17 :సీఎం సహాయనిధి పథకంనిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని 15వ, వార్డుకు చెందిన విజయ్‌కి మంజూరైన రూ.31 వేల విలువగల సీఎం సహాయనిధి చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు పల్లె దావాఖానాలను త్వరలోనే ప్రభుత్వం అందుబాటు లోకి తీసుకరానుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట మల్లిఖార్జున్‌, కూతురు రాజేష్‌, నాయకులు దేశాయ్‌, సతీష్‌ రాజ్‌ తదితరులు ఉన్నారు.