Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ఎంపీడీవోకు క్షమాపణలు చెబుతున్నా: ఎమ్మెల్యే కొండేటి

తూర్పు గోదావరి: అయినవిల్లి ఎంపీడీవో విజయకు తాను బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఎంపీడీవో విజయపై వైసీపీ నేత తాతాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఏడాది నుంచి తాతాజీ పార్టీకి దూరంగా ఉంటున్నారన్నారు. ఆయనతో వైసీపీకి సంబంధం లేదన్నారు. మహిళా ఎంపీడీవోపై తాతాజీ దుర్భాషలాడినందుకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చిట్టిబాబు పేర్కొన్నారు.  ఎంపీడీఓపై అధికార పార్టీ నేత ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చాంబర్‌లోనే దళిత ఎంపీడీఓపై  వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ ఏకవచనంతో రెచ్చిపోయారు. ఎంపీడీఓ నచ్చకపోతే పంపించేయండని అంటే సరిగ్గా చేయకపోతే చీరేస్తానని వైసీపీ నేత బెదిరించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వైసీపీలోని ఒక వర్గం టార్గెట్ చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీడీఓ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కొంతమంది వైసీపీ నేతల మాట ఆమె దగ్గర చెల్లకపోవడంతో కొన్ని నెలలుగా ఎంపీడీఓపై నేతలు కక్ష్యగట్టి ఆరోపణలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 


 వైసీపీ నేతలపై కేసు నమోదు..

 తూర్పు గోదావరి అయినవిల్లి మండలం ఎంపీడీవో కట్టుపల్లి రాజ విజయను బెదిరించిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినవిల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, ఎన్.పెదపాలెం మాజీ సర్పంచ్ నేదునూరు తాతాజీ, క్రాప శంఖరాయగూడెం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులుపై కేసు నమోదు చేశారు.Advertisement
Advertisement