గుంటూరు: పల్నాడు వారసులుగా అందరం సంతోషంగా ఉన్నామని, నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైందని, ఈ సందర్భంగా సిఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసమే టీడీపీ చిన్న చిన్న పిల్లలను వాడుకుంటోందని ఆరోపించారు. ఎంతమంది ఇబ్బంది పడినా చంద్రబాబు మాత్రం సిఎం కావాలనుకుంటున్నారని, గిచ్చి, గిల్లి మరీ తగాదాలు పెట్టుకుంటున్నారని ఎమ్మెల్యే బొల్లా విమర్శించారు.
ఇవి కూడా చదవండి