Abn logo
Aug 4 2021 @ 00:50AM

ఘనంగా ఎమ్మెల్యే జన్మదినం

కేకు కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే వేణుగోపాల్‌

దర్శికి తరలిన నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభిమానులు 

అభినందనలు తెలిపేందుకు పోటీ పడ్డ నేతలు

దర్శి, ఆగస్టు 3 : దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలుత చలివేంద్ర కొండ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. దర్శి -కురిచేడు రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో,రాజంపల్లి వద్దగల ప్రసన్నాంజనేయస్వామి ఆలయం లో పూజలు నిర్వహించారు.  అనంతరం వైసీపీ నాయకులు టీ చంద్రశేఖర్‌, రాజంపల్లిలో సింగిల్‌ విండో అధ్యక్షులు వజ్జా శ్రీనివాసరావు, దర్శి గడియార స్తంభం వద్ద వైసీపీ నాయకులు ముత్తినీడి సాంబయ్య ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. నగర పంచాయతీకార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. రెడ్డి కాంప్లెక్స్‌ వద్ద వీసీరెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటుచేసినవేడుకల్లో నగర పంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం దర్శిలో అభిమానుల నడము భారీ కేకును కట్‌ చేశారు. ఒంగోలు కార్పోరేషన్‌ మేయర్‌ సుజాత ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో దర్శి సొసైటీ చైర్మన్‌ పూజల చిన్నయ్య, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ వి.చెన్నారెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, తూర్పువెంకటాపురం సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడగం పుల్లారెడ్డి, వైసీపీ నాయకులు సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైవీ సుబ్బయ్య, కొట్టేమల్లిఖార్జునరావు, వద్దినేని వెంకటేశ్వర్లు, కె.రాంభూపాల్‌రెడ్డి, తిరుమలవెంకి తదితరులు పొల్గొన్నారు.

ముండ్లమూరు : దర్శిలో జరిగిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు వెళ్లారు.  వైసీపీ సంయుక్త రాష్ట్ర కార్యదర్శి  ఎస్‌.బ్రహ్మానందరెడ్డి, అంబటి వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి తాతపూడి రత్నరాజు, సొసైటీ అధ్యక్షుడు బద్రి వెంకట సుబ్బారెడ్డి, గోనుగుంట్ల వెంకటేశ్వర్లు, చింతల రామకృష్ణారెడ్డి, పుల్లంశెట్టి నరేష్‌, మేడికొండ జయంతి, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్‌లు ఒగురూరి రామాంజీ, కందిమళ్ల గీతాంజలి, నలమోలు వెంకటేశ్వరరావు, వెంకటరావు, గోరంట్ల రాంబాబు, జమ్ముల గురవయ్య, నిడమానూరి చెంచయ్య, వేముల శ్రీనివాసులు, జానకి రామయ్య, యాకోబు, నంబూరి ఏసు, డీలర్లు కాసా యల్లారెడ్డి, పమిడిమర్రి ఆంజనేయులు, నాగసూరి సుబ్బయ్య,  తహసీల్దార్‌ పీ పార్వతి, ఎంపీడీవో చంద్రశేఖరరావు, ఏపీవో వెంకటరావు, ఏపీఎం సీమోను తదితరులు ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. 

 ముండ్లమూరు : ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు మండల దళిత సంఘం నాయకుడు పాలెపోగు డగ్లస్‌ పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం తృప్తి నిచ్చిందన్నారు. వైద్యాధికారులు మనోహర్‌రెడ్డి, జ్యోతి, గ్రామ నాయకులు బొల్లేపల్లి ఆదినారాయణ, తాతపూడి దేవయ్య, ఉల్లి హనుమంతరావు పాల్గొన్నారు.ఉపాధి హామి పథకం కార్యాలయంలో కేకు కట్‌ చేశారు.

దొనకొండకు పోటెత్తిన అభిమానులు

దొనకొండ : ఎమ్మెల్యే వేణుగోపాల్‌ వ్యక్తిగత సలహాదారుడు మురళీ, వైసీపీ మండల మాజీ కన్వీనర్‌ కందుల.నారపురెడ్డిల నేతృత్వంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.  అనంతరం భారీ కేకును కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దొనకొండ అభివృద్దికి బాధ్యతగా కృషి చేస్తానన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన కొద్దిసేపు తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్‌, వెంకటాపురం ఎంపీటీసీ బొరిగొర్ల.ఉషారాణి, మురళీకృష్ణ, దొనకొండ సర్పంచ్‌ కొదమల.గ్రే్‌సరత్నకుమారి, దేవానంద్‌, పెద్దన్నపాలెం సర్పంచ్‌ మిండాల.మంగమ్మ, నాగయ్య, ఉపసర్పంచ్‌ పఠాన్‌.ఇమ్రాన్‌ఖాన్‌, చందవరం వైసీపీ నాయకుడు బీ.ఎస్‌.రాజు, నాయకులు గార్లపాటి.యల్లయ్య, ఉప్పలపాటి.కిరణ్‌ప్రసాద్‌, రొడ్డా.వెంకటరామయ్య, బత్తుల.వెంకటసుబ్బయ్య, సయ్యద్‌ ముజాహిద్‌, పాతకోట.బాలకోటిరెడ్డి, మల్లెల.రవికుమార్‌, బొరిగొర్ల ఏడుకొండలు, సయ్యద్‌ గఫార్‌, జొన్నకూటి.సుబ్బారెడ్డి మరికొందరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  తహసీల్దార్‌  వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కే.జీ.ఎస్‌.రాజు, ప్రధానోపాధ్యా యుడు, కోటిరెడ్డి, సర్వేయర్‌ చెన్నంశెట్టి. వెంకటరాఘవులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రభు చారిటబుల్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీత చైర్మన్‌ ఆదిమూలపు.ప్రభుదాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం రైల్వేస్టేషన్‌ సెంటర్‌లో భారీ కేకుకట్‌ చేసి  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీటీసీ బొరిగొర్ల.ఉషారాణి, మురళీ, దొనకొండ ఉపసర్పంచ్‌ పఠాన్‌.ఇమ్రాన్‌ఖాన్‌, వైసీపీ యూత్‌ ముజాహిద్‌, గుంటు. ఐజక్‌,  ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

కురిచేడు : స్థానిక కురిచేడు మార్కెట్‌ యార్డు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.  వైసీపీ మండల నాయకులు బెల్లం చంద్రశేఖరరావు, మేరువ పిచ్చిరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, నుసుం నాగిరెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, కేసనపల్లి కిష్టయ్య, బెల్లం సురేష్‌, యెనుగంటి గోపి, మేకల రాంబాబు, తాళ్ళూరి ఆంజనేయులు, ఊట్ల నాగేశ్వరరావు, నక్కా రామక్రిష్ణ, పోలెబోయిన పిచ్చయ్య, నిమ్మకాయల రాజయ్య. యన్నాబత్తిన సుబ్బయ్య, ఆవుల వెంకట రెడ్డి, వేమా శ్రీను, వెంకటేశ్వర్లు, కానాల శివారెడ్డి, జి.లింగారెడ్డి, షేక్‌ సైదా, వేమా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇక తహసీల్దార్‌ నరసింహారావు,  సిబ్బంది, ఎస్‌ఐ పులి శివనాగరాజు,  బెల్లం చంద్రశేఖర్‌, యెనుగంటి గోపి, మేకల రాంబాబు, మేరువ సుబ్బారెడ్డి ఉన్నారు. 

తాళ్లూరు : ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు తాళ్లూరు  మండలం నుంచి భారీగా వైసీపీ నేతలు తరలివెళ్లారు.  వైసీపీ మండల కన్వీనర్‌, దర్శి ఏఎంసీ చైర్మన్‌ ఐ.వేణుగోపాల్‌రెడ్డి, వైసీపీ జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మారం వెంకటరెడ్డి, తాటికొండ శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరెడ్డి, విఠలాపురం, తాళ్లూరు, తూర్పుగంగవరం సర్పంచ్‌లు మారం ఇంద్రసేనారెడ్డి, మేకలచార్లెస్‌ సర్జన్‌, చాట్లనాగమణి,  మన్నేపల్లి సొసైటీ చైర్‌పర్సన్‌ మంచాల వలసారెడ్డి, బొద్దికూరపాడు మాజీ సొసైటీ అధ్యక్షులు పులి.ప్రసాదరెడ్డి, వైసీపీ నేతలు నిశ్శంకం హనుమంతరావు, తూము వెంకటసుబ్బారెడ్డి, యత్తపు కాశిరెడ్డి, పోశం శ్రీకాంత్‌రెడ్డి, కుమ్మిత జయరామిరెడ్డి, కొర్రపాటి శరత్‌బాబు, యాడిక శ్రీనివాసరెడ్డి, దారం వెంకటరమణారెడ్డి,పులి బ్రహ్మారెడ్డి,అనీల్‌రెడ్డి,పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ అభ్యర్దులు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు దర్శి తరలి వెళ్లి శుభాకాంక్షలుతెలిపి ఎమ్మెల్యే మద్దిశెట్టి సోదరులు,వేణుగోపాల్‌, రవీంద్ర, శ్రీధర్‌లను గజమాలతో సత్కరించారు. తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, ఎంపీడీవో కేవీ కోటేశరరావు, ఏపీవోప్రదీ్‌పకుమార్‌, ఎస్సై బి.నరసింహారావు, గ్రామకార్యదర్శులు, వీఆర్వోలు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.