అనుకుంటే రేవంత్‌ను జైలుకు పంపుతాం: భాస్కర్‌రావు

ABN , First Publish Date - 2021-08-10T20:29:20+05:30 IST

హైదరాబాదు: అనుకుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని జైలుకు పంపే అవకాశం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉందని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు.

అనుకుంటే రేవంత్‌ను జైలుకు పంపుతాం: భాస్కర్‌రావు

హైదరాబాదు: అనుకుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని జైలుకు పంపే అవకాశం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉందని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను ఎమ్మెల్యే ఖండించారు. భాస్కర్‌రావు మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలకు దిగొద్దని సూచించారు. రేవంత్ రెడ్డి  వీధి రౌడీలా మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే ప్రజలు సహించరని చెప్పారు. అనుకుంటే రేవంత్ రెడ్డిని జైలుకు పంపే అవకాశం తమకు ఉందని.. కానీ సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపే అవకాశం రేవంత్ రెడ్డికి ఎప్పటికీ రాదన్నారు. జన్మలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని.. అలాగే రేవంత్ కూడా సీఎం కాలేడని జోస్యం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారు సర్వెంట్లుగా ఉన్నారని.. కేసీఆర్ తెలంగాణ తేవడంతో తల ఎత్తుకుని తిరుగుతున్నామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-10T20:29:20+05:30 IST