Abn logo
Jun 15 2021 @ 15:25PM

తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలి పెట్టదు: ఎమ్మెల్యే బాలరాజు

పశ్చిమగోదావరి: వైసీపీ ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కేఆర్ పురం ఐటీడీఏ ఘటనలపై పోలవరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ..  తమ ప్రభుత్వంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదన్నారు. ఏజెన్సీలో అమాయక ప్రజలను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం ఏజెన్సీలో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ దర్యాప్తులో ఎవరైనా తప్పు చేసినట్లుగా తేలితే చర్యలు తప్పవన్నారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలి పెట్టదన్నారు.