పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-04T10:13:21+05:30 IST

గిద్దలూరు మార్కెట్‌ యార్డు ఆవరణలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు బుధవారం ప్రారంభించారు.

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

గిద్దలూరుటౌన్‌, జూ న్‌ 3 : గిద్దలూరు మార్కెట్‌ యార్డు ఆవరణలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు బుధవారం ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పసుపు క్వింటాకు మద్దతు ధర రూ.6850 నిర్ణయించినట్లు చెప్పారు. కంభం యార్డులో పట్టు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యార్డు చైర్మన్‌ షేక్‌ మెహతాబ్‌, వైసీపీ నాయకులు కడప వంశీధర్‌రెడ్డి, ఆర్డీ రామకృష్ణ, దమ్మాల జనార్దన్‌, బయ్యన్నయాదవ్‌, వెంకటనాయుడు, మార్క్‌ఫెడ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.  


కంభం : మూడు మండలాల రైతులకు ఆదరువు అయిన కంభం వ్యవసాయ మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్పారు. బుధవారం మార్కెట్‌యార్డు కార్యదర్శి బా లాజీ అధ్యక్షతన జరిగిన ఏఎంసీ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాంబాబు హాజరయ్యారు. కోల్డ్‌స్టోరేజీ, మరుగుదొడ్లు, రహదారి సౌకర్యం కల్పించాలని రైతులు కోరగా ఎమ్మెల్యే స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 


అద్దంకిలో...

అద్దంకి, జూన్‌ 3 : మార్క్‌ఫెడ్‌ ద్వారా పట్టణంలోని మార్కెట్‌ యా ర్డులో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాసులు చెప్పారు. పండిన పసుపు పంట ఈక్రాప్‌ అయిన రైతుల పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పసుపు సాగు ఎక్కువగా ఉన్న కొత్తరెడ్డిపాలెం రైతుల సమస్యలను ఇటీవల వైసీపీ ఇన్‌చార్జి కృష్ణచైతన్య తెలుసుకున్నారు. ఆయన కృషితో కేంద్రం ఏర్పాటు చేశారు.  

Updated Date - 2020-06-04T10:13:21+05:30 IST