ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ కు సమస్యలతో స్వాగతం

ABN , First Publish Date - 2022-08-11T06:12:36+05:30 IST

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ కు సమస్యలతో స్వాగతం

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ కు సమస్యలతో స్వాగతం

తోట్లవల్లూరు, ఆగస్టు 10 : తోట్లవల్లూరులో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా  ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌  సౌత్‌వల్లూరు దళితవాడలో  పర్యటిం చారు. ఎమ్మెల్యేకు అనేక సమస్యలు స్వాగతం పలికాయి. బంగాళతోటలో కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్న ఇళ్లస్థలాలు, డ్రెయినేజీ సమస్యలు, రైతు భరోసా సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంక్షేమ పథకాలు అందించిన బుక్‌లెట్‌లో ఇంటి నిర్మాణానికి రూ 1.80 లక్షలు మంజూరైనట్టు పేర్కొనటంతో మాకు ఇంత వరకు నివేశన స్థలాలే ఇవ్వలేదని ప్రజలు ప్రశ్నించారు. 

 తోట్లవల్లూరు(సౌత్‌)లో తాగునీటి అవసరాలను మెరుగు పర్చేందుకు జల జీవన్‌ మిషన్‌ నిధులు రూ 1.14 కోట్లతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఎంపీపీ ఈడ్పుగంటి రాజామణి, జడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ పెనుముత్స రాధిక, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T06:12:36+05:30 IST