ఐసోలేషన్‌పై అపోహ లొద్దు

ABN , First Publish Date - 2020-03-29T09:29:12+05:30 IST

కూచిపూడి సిలికానాంధ్ర వైద్య శాలలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డుపై ప్రజలు ఎలాంటి అపోహలు చెందాల్సిన అవ సరం లేదని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ అన్నారు.

ఐసోలేషన్‌పై అపోహ లొద్దు

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌


కూచిపూడి : కూచిపూడి సిలికానాంధ్ర వైద్య శాలలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డుపై ప్రజలు ఎలాంటి అపోహలు చెందాల్సిన అవ సరం లేదని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ అన్నారు. శనివారం ఐసోలేషన్‌ వార్డును ఆయన పరిశీలించి అధికారులతో చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ముందస్తు చర్యల్లో భాగంగానే ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేసిందన్నారు.


కరోనా అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి ఐసోలేషన్‌ వార్డులో పరిశీలనలో ఉంచుతామన్నారు. కరోనా పాజిటివ్‌ అని తేలితే మెరుగైన చికిత్స కోసం విజయ వాడకు తరలిస్తామన్నారు.  నిత్యావసరాల ధరలు కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  ఎమ్మెల్యే హెచ్చరించారు. 


గుడివాడ(రాజేంద్రనగర్‌)  : సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని గుడివాడ డీఎస్పీ ఎన్‌.సత్యానందం, క్వారంటైన్‌ కేంద్రం ఇన్‌చార్జి డాక్టర్‌ సుదర్శన్‌బాబు అన్నారు. డాక్టర్‌ గురురాజు ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల క్వారంటైన్‌ కేంద్రాన్ని  శనివారం  పరి శీలించారు.  వారు మాట్లాడుతూ  డివిజన్‌లో ఇప్పటికే  210 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నా రన్నారు. 


గరికపాడులో మరో క్వారంటైన్‌ కేంద్రం 

గరికపాడు (జగ్గయ్యపేట రూరల్‌) :  గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రంలో మరో క్వారం టైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. హైకోర్టు ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి ఎన్‌ వోసీతో వస్తున్న వారిని రాష్ట్ర సరిహద్దు వద్దనే పరిశీలించి ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమ తించాలన్నారు. ఇబ్బందులుంటే క్వారంటైన్‌కు తరలించాలన్నారు. అవసరం లేకుంటే వారిని గృహ నిర్బంధంలో ఉంచేలా చర్యలు తీసు కోవాలన్నారు.  

ప్రస్తుతం గురుకుల పాఠశాలలో 100 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర ప్రవేశ ద్వారానికి దగ్గరగా ఉన్న కేవీకే రైతుల విశ్రాంతి భవనంలో మరో 100 పడకలతో క్వారంటైన్‌ను ఏర్పాటు చేస్తు న్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-03-29T09:29:12+05:30 IST