టీడీపీ హయాంలోనే రాష్ర్టాభివృద్ధి

ABN , First Publish Date - 2020-08-09T12:25:11+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నవ్యాంధ్రప్రదేశ్‌లోని..

టీడీపీ హయాంలోనే రాష్ర్టాభివృద్ధి

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌


రేపల్లె(గుంటూరు): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అభివృద్ది చేశామని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు- కళింగపట్నం పోర్టు, స్మార్ట్‌ సిటీ, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌, హార్డ్‌వేర్‌పార్కు, ఈస్ట్‌ కోస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీలు ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, మెడికల్‌ కళాశాల, స్మార్ట్‌సిటీ, గిరిజన యూనివర్సిటీ, స్టీల్‌ఎక్సేంజ్‌ ఇండియా లిమిడెడ్‌ నిర్మించామన్నారు.


విశాఖపట్నం జిల్లాలో ఐఐఎం, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ పారెన్‌ట్రేడ్‌, ఫిన్‌టెక్‌వ్యాలీ, అదాని డెటా సెంటర్‌, మిలీనియం టవర్స్‌, లూలూ కన్వెన్షన్‌ సెంటర్‌ అభివృద్ధి చేశామన్నారు. తూర్పుగోదావరిలో పెట్రోలియం, తెలుగు యూనివర్సిటీలు, పశ్చిమగోదావరి జిల్లాలో నిట్‌, నర్సాపూర్‌ పోర్టు, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలు, ఉద్యాన పరిశోధన కేంద్రం వంటి అనేకం ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా జిల్లాలో ఆటోమొబైల్‌ హబ్‌, కూచిపూడి అకాడమీ, అశోక్‌లేలాండ్‌, వీబీసీ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ టీడీపీ హయాంలో రూపుదిద్దుకున్నాయన్నారు.


గుంటూరు జిల్లాలో స్మార్ట్‌సిటీ, టెక్స్‌టైల్‌ పార్కు, చెట్టినాడ్‌ సిమెంట్‌ వంటివాటిని ఏర్పాటు చేశారన్నారు. ప్రశాశం జిల్లాలో ఫుడ్‌పార్కు, యూనివర్సిటీ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ మినరల్‌ సైన్సెస్‌, రూ.24,500 కోట్లతో పేపర్‌మిల్లు, నెల్లూరు జిల్లాలో ధర్మల్‌ పవర్‌టెక్‌, చిత్తూరు జిల్లాలో ఐఐటి, మెగా ఫుడ్‌ పార్కు, ఐటీ హబ్‌, రేణిగుంటలో రిలయన్స్‌, హీరో మోటార్స్‌, ఇసుజి మోటార్స్‌, పెప్సికో, క్యాడ్బరి, అనంతపురం జిల్లాలో సోలార్‌, విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు, కియా పరిశ్రమ, వంటివి ఏర్పాటు చేయించామన్నారు. కడప జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ, స్టీల్‌ప్లాంట్‌, పారిశ్రామిక స్మార్ట్‌సిటీ, ఆంధ్రబేరటీస్‌ కార్పొరేషన్‌, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక నగరం, విత్తన ఉత్పత్తి కేంద్రం, సిమెంట్‌ కంపెనీలను, ఏర్పాటు చేయించామని ఆయన వివరించారు.అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హాయాంలోనే జరిగిందని ఆయన స్పష్టం చేశారు.  


Updated Date - 2020-08-09T12:25:11+05:30 IST