వైసీపీ ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం: ఎమ్మెల్యే అనగాని

ABN , First Publish Date - 2021-10-24T23:19:43+05:30 IST

వైసీపీ ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తోందన్నారు.

వైసీపీ ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: వైసీపీ ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి, ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానన్నారు. రెండున్నరేళ్లైనా ఎందుకు హామీలు అమలు చేయడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ  ప్రభుత్వం 43 శాతం పిట్ మెంట్ ఇచ్చిందని గుర్తుచేశారు. హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చిన శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఉచిత వసతి, వారంలో 5 రోజుల పనిదినాలు మాత్రమే కల్పించిందని పేర్కొన్నారు. సమైక్యాoధ్ర ఉద్యమంలో 81 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లింపులను చంద్రబాబు చేశారని చెప్పారు. జగన్ వచ్చి రెండున్నరేళ్లు అయినా ఫిట్ మెంట్ ప్రకటించలేదన్నారు. చిత్తశుద్ధి లేకుండా కమిటీలు వేసి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇవ్వాల్సిన ఐదు డీఏలకు అతీగతి లేదన్నారు. జగన్ చేసిన  మోసానికి రోడ్లపైకి వచ్చి ఉద్యోగులు పోరాడాలని సూచించారు. 

Updated Date - 2021-10-24T23:19:43+05:30 IST