భక్తితోనే ముక్తి

ABN , First Publish Date - 2020-12-03T05:22:45+05:30 IST

భక్తితోనే ముక్తి

భక్తితోనే ముక్తి
పూజల అనంతరం భక్తులనుద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌
  • వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
  • గోవింద నామస్మరణతో మార్మోగిన ఎర్రగట్టు 
  • భారీగా తరలివచ్చిన భక్తజనం

చౌదరిగూడ: భక్తితోనే ప్రతీ మనిషికి ముక్తి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. చౌదరిగూడ మండల పరిధిలోని ఎర్రగట్టు చౌరస్తాలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠా పన కార్యక్రమాన్ని వేద పండితులు కారంపూడి నరసింహాచార్యులు, వంశీకృష్ణ భాగవతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ధ్వజారోహణం, దృష్టికుంభం, మూర్తికుంభ ప్రోక్షణ, శ్రీనివాసుని కల్యాణం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను చేపట్టారు. పూజలకు పలు గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని చౌదరిగూడ మండలం ఆధ్యాత్మికత నిలయంగా మారిందని పేర్కొన్నారు. కార్తీక, శ్రావణ మాసాల్లో ప్రతి ఒక్కరిలో దైవచింతన పెరుగుతోందని, భక్తి కూడా ఈ మండలంలో ఎక్కువగా కనిపిస్తోందన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడు కొలువుదీరడం ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. నిత్యాన్నదానం చేపట్టిన వ్యాపారవేత్త ఆకారపు నాగరాజును ఎమ్మెల్యే అభినందించారు. ఇలాగే భవిష్యత్‌లో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని ట్రస్టు సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కవిత, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈ.గణేష్‌, జడ్పీటీసీ స్వరూపరాములు, కొందుర్గు వైస్‌ఎంపీపీ రాజే్‌షపటేల్‌, బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి, ట్రస్ట్‌ చైర్మన్‌ సుధాకర్‌రావు, సభ్యులు ఎస్‌.లక్ష్మీనారయణ, ఆకారపు నాగరాజు, గోపాల్‌రెడ్డి, కొనేరి శ్రీనివాస్‌, పి.వెంకటేష్‌, రఘునందన్‌చారి, బోయ రాంచంద్రయ్య, గున్నాల చంద్రశేఖర్‌, చందు, మాధవరెడ్డి, నందీశ్వర్‌, కొవురి సింహయ్య, నరేష్‌, అమర్‌నాథ్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు భూపాల్‌చారి, విష్ణువర్దన్‌ రెడ్డి, పి.వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, హఫీజ్‌, కొండి యాదయ్య, అరుణమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:22:45+05:30 IST