Abn logo
May 16 2021 @ 23:46PM

ఆక్సిజన్‌ ఇబ్బంది రావొద్దు

కలెక్టర్‌ శర్మన్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత లే కుండా చూడాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధికారులను కోరారు. జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం ఆయన కలెక్టర్‌ ఎల్పీ శర్మన్‌, అదనపు కలెక్టర్‌ శ్రీ నివాస్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి మంజూరైన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను రెండు మూడు రో జుల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎంజేఆర్‌ ట్రస్టు ద్వారా 20 ఆక్సిజన్‌ సీలిండర్లను అందజేస్తామని, దానికి సంబంధించి 20 ఆక్సిజన్‌ సీలిండర్లను తెప్పించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఆసుపత్రిలో డ్రె ౖనేజీ సిస్టమ్‌ ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే డ్రైనేజీ సిస్టమ్‌ పనులను చేయాలని మునిసిపల్‌ కమిషనర్‌ గోన అన్వేష్‌ను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వాహనాలను పార్కింగ్‌ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ సుపత్రి ముందు, ఎమర్జెన్సీ విభాగం ముందు సీసీ వేయాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఆధునికీకరణ పనులు త్వరలో ప్రారంభం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement