డిసెంబరులో గణేశ పరిశ్రమ ప్రారంభం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-15T06:09:04+05:30 IST

డిసెంబరులో గణేశ పరిశ్రమ ప్రారంభం: ఎమ్మెల్యే

డిసెంబరులో గణేశ పరిశ్రమ ప్రారంభం: ఎమ్మెల్యే
టెక్స్‌టైల్‌ పార్కులో పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి

గీసుగొండ, మే 14: కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో 20ఎకరాల్లో 6 యూని ట్‌లుగా నిర్మిస్తున్న గణేశా పరిశ్రమల్లో మొదటి యూనిట్‌ డిసెంబరులో ప్రారం భం కానుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. పార్కులో గణేశ ఈకో టెక్‌, గణేశ ఈకో పెట్‌ కంపెనీలకు చెందిన నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి యూనిట్‌ ప్రారంభంతో 500మందికి, 6యూనిట్‌లు ప్రారంభం అయితే 3000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భూ నిర్వాసితులకు మొదటి ప్రాధాన్యంగా ఉపాఽధి కల్పించటం జరుగుతుందన్నారు. ఈ రెండు కంపెనీలు రూ.800కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణాలు చేపడుతుందన్నారు. ఇందులో దారం, పీపీ ఫైబర్‌, వ్యాషింగ్‌ప్లాంట్‌, పెట్‌ వస్తువులు మొదలైనవి తయారవుతాయని వివరించారు. అనంతరం పార్కులో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంతో నిర్మించే రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-15T06:09:04+05:30 IST