MK Stalin పాలనకు ఏడాది..బస్సులో ప్రయాణించిన సీఎం

ABN , First Publish Date - 2022-05-07T21:40:11+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం శనివారం తొలి ఏడాది పాలన..

MK Stalin పాలనకు ఏడాది..బస్సులో ప్రయాణించిన సీఎం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK.Stalin) సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం శనివారం తొలి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) బస్సులో ప్రయాణించి నేరుగా ప్రయాణికులతో ముచ్చటించారు. అసెంబ్లీలో పలు ప్రజాసంక్షేమ ప్రకటనలు చేశారు.


రాధాకృష్ణ సాలైలో 29C నెంబర్ బస్సులో స్టాలిన్ ప్రయాణిస్తూ, తమ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం గురించి వారితో కాసేపు మాట్లాడారు. దీనికి ముందు, తన తండ్రి దివంగత సీఎం కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం, అసెంబ్లీలో పలు ప్రజా సంక్షేమ ప్రకటనలు చేశారు. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు అన్ని పనిదినాల్లో న్యూట్రీషియన్ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తామని ప్రకటించారు. గత ఏడాదిగా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు. ద్రవిడయన్ మోడల్ తరహాలో రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల వైద్య అవసరాల కోసం మరిన్ని అర్బన్ మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Read more