ఆధిక్యంలో డీఎంకే.... ముందంజ‌లో స్టాలిన్

ABN , First Publish Date - 2021-05-02T16:42:45+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాల్లో...

ఆధిక్యంలో డీఎంకే.... ముందంజ‌లో స్టాలిన్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే హవా కొన‌సాగుతోంది. ప్రస్తుతం డీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీతో పొత్తుపెట్టుకున్న‌ అన్నాడీఎంకే 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్ సొంత నియోజకవర్గమైన కొళత్తూర్‌లో ఆయ‌న మొద‌టి నుంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి స్టాలిన్ 1,754 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. స్టాలిన్‌కు మొత్తం 3,199 ఓట్లు ల‌భించ‌గా, అన్నాడీఎంకే అభ్యర్థి రాజారాంన‌కు 1,445 ఓట్లు వ‌చ్చాయి. 



Updated Date - 2021-05-02T16:42:45+05:30 IST