కరోనా నియంత్రణే ధ్యేయం

ABN , First Publish Date - 2021-05-10T14:34:03+05:30 IST

సంపూర్ణ లాక్‌డౌన్‌తోనే కరోనా నియంత్రణ సాధ్యమని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా పర్యవేక్షిం చాలని ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్‌ ..

కరోనా నియంత్రణే ధ్యేయం

పకడ్బందీగా అమలయ్యేలా పర్యవేక్షించండి 

లాక్‌డౌన్‌పై మంత్రులకు సీఎం దిశానిర్దేశం


చెన్నై(ఆంధ్రజ్యోతి): సంపూర్ణ లాక్‌డౌన్‌తోనే కరోనా నియంత్రణ సాధ్యమని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా పర్యవేక్షిం చాలని ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో తొలి మంత్రివర్గం సమావేశం ఆదివారం సచివాలయం ప్రాంగణంలోని నామ క్కల్‌ కవీంజర్‌ మాళిగైలో జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రు లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, వివిధ శాఖల ఉన్నతా ధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ... రాష్ట్రం లో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నామన్నారు.లాక్‌డౌన్‌ సంపూర్ణంగా అమలైతేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో లాక్‌డౌన్‌ సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని కోరారు. అలాగే, జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు సత్వరం చికిత్స అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యులు, నర్సులు, సిబ్బంది, బాధితులకు నాణ్యమైన భోజనం అందే లా పర్యవేక్షించాలన్నారు.


రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు కొరత లేకుండా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని, ఈ ఆక్సిజన్‌ సక్రమంగా విని యోగమవుతుందా లేదా అన్నది పరిశీలించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్‌ వృధా కాకుండా వుండేలా చర్యలు చేపట్టాలన్నారు. చెన్నై సహా కోవై, సేలం, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్న బాధితుల కోసం రెమ్‌డెసివిర్‌ విక్రయించేలా చర్యలు చేపట్టామని, ఈ విక్రయాలు పర్యవేక్షించడంతో పాటు ఇవి బహి రంగ మార్కెట్లోకి వెళ్లకుండా నిరోధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 45 ఏళ్ల వయస్సున్న ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలని సూచిం చామని, అయినా, టీకాపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు పోగొట్టేలా అవగాహన ప్రచారాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వైద్యం, ఆరోగ్యం, పోలీసులు, నగరాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలు సహా అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తేనే సంపూర్ణ లాక్‌డౌన్‌తో ఆశించిన ఫలితాలు సాధిస్తా మన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరించి రెండు వారాలు ఇంటి నుంచి బయటకు రావడాన్ని మానుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.


ప్రజలు మెచ్చే పాలన అందిస్తా

నిజాయితీ, నిబద్ధతో ప్రజలు మెచ్చే పాలన అందిస్తానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను కార్య కర్తలకు రాస్తున్న మొదటి లేఖ ఇది. కలైం జర్‌ కరుణానిధి చూపిన బాటలో పార్టీ అభివృద్ధి అహ ర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తల్లో ఒకడిగా ఉన్న తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు నిర్విరామంగా, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలే కారణమన్నారు. పదేళ్ల కాలంలో కార్యకర్తలు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారని, గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు కోసం ఎదురుచూద్దామని పిలుపునిచ్చారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసేలాగా, నిజా యితీ, నిబద్ధతో కూడిన ప్రజలు మెచ్చే పాలన అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు కొత్త ప్రభుత్వానికి సవాలుగా ఉందన్నారు. కరోనా రెండవ దశ రాష్ట్రంలో తీవ్రంగా విజృంభిస్తోందని, ఆ మహమ్మారి నుంచి ప్రజలను కాపా డడం, వైరస్‌ను నియంత్రించడం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యాల న్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడం, వారు టీకా వేసుకొనేలా చూడడం ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. ప్రజలు ఎంత నమ్మకంతో మనకు అధికారం కట్టబెట్టారో, వారి ఆలోచనలు, అభిప్రాయాలకు తగ్గట్గుగా పాలన సాగిస్తామని సీఎం స్టాలిన్‌ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-10T14:34:03+05:30 IST