హైదరాబాద్: ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి మియాపూర్ ఎస్సై చిక్కాడు. 20వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా మియాపూర్ ఎస్సై యాదయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 30 వేల రూపాయలను ఎస్సై యాదయ్య డిమాండ్ చేశాడు. 10 వేల రూపాయలను ఎస్సై యాదయ్యకు బాధితుడు ఇచ్చి అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.