వారాంతంలో మిశ్రమ ముగింపు

ABN , First Publish Date - 2021-05-15T06:08:29+05:30 IST

వరుసగా రెండు సెషన్లపాటు నష్టాల్లో కొనసాగిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. వారాంతం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభ, నష్టాల మధ్య ఊగిసలాడాయి

వారాంతంలో మిశ్రమ ముగింపు

వరుసగా రెండు సెషన్లపాటు నష్టాల్లో కొనసాగిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. వారాంతం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభ, నష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి మిశ్రమంగా ముగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 41.75 పాయింట్ల లాభంతో 48,732.55 వద్ద, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 18.70 పాయింట్ల నష్టంతో 14,677.80 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 20 నష్టాలు చవిచూశాయి. అన్నిటికంటే అధికంగా ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 2.82 శాతం క్షీణించింది. కాగా ఏషియన్‌ పెయింట్స్‌ షేరు ఏకంగా 8.51 శాతం ఎగబాకి సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ వారం మొత్తానికి సెన్సెక్స్‌ 473.92, నిఫ్టీ 145.35 పాయింట్లు నష్టపోవాల్సి వచ్చింది. 

Updated Date - 2021-05-15T06:08:29+05:30 IST