‘మహిళా క్రికెట్‌ సచిన్‌.. మిథాలీ’

ABN , First Publish Date - 2021-05-17T09:24:33+05:30 IST

మిథాలీ రాజ్‌.. భారత మహిళా క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ అని బీసీసీఐ మాజీ జీఎం ప్రొఫెసర్‌ రత్నాకర్‌ షెట్టి కొనియాడాడు.

‘మహిళా క్రికెట్‌ సచిన్‌.. మిథాలీ’

న్యూఢిల్లీ: మిథాలీ రాజ్‌.. భారత మహిళా క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ అని బీసీసీఐ మాజీ జీఎం ప్రొఫెసర్‌ రత్నాకర్‌ షెట్టి కొనియాడాడు. కొంతమంది ప్లేయర్లు జట్టు కంటే తామే గొప్ప అన్న భావనలో ఉన్నారని మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. మిథాలీని ఉద్దేశించే రామన్‌ ఇలా మాట్లాడాడనే ఊహాగానాలు బయల్దేరాయి. ఈ నేపథ్యంలో రత్నాకర్‌ షెట్టి మాట్లాడుతూ.. ‘మిథాలీ రెండు దశాబ్దాలుగా టీమిండియాకు ఆడుతోంది. మిథాలీ భారత్‌ క్రికెట్‌కు ఎంతో సేవలందించింది. ఆమెను భారత మహిళా క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌గా అభివర్ణించొచ్చు. ప్రతి క్రీడాకారిణిపై ఆమెకు కొన్ని అభిప్రాయాలుంటాయి. కొన్నివేళల్లో కోచ్‌లతో ఏకీభవించకపోవచ్చు. అయితే, ఆట అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కోచ్‌ మాటకు కెప్టెన్‌ విలువ ఇవ్వాల్సి ఉంటుంది’ అని అన్నాడు. 

Updated Date - 2021-05-17T09:24:33+05:30 IST