Abn logo
Aug 2 2020 @ 03:43AM

రిటైర్మెంట్‌ ఆలోచన లేదు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌క్‌పను గెలచుకోవడంపైనే తన దృష్టంతా ఉందని భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ స్పష్టం చేసింది. అందుకే ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచనేమీ లేదని స్పష్టం చేసింది. 2017 వరల్డ్‌క్‌పలో మిథాలీ సేన ఫైనల్‌కు చేరడంతో దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. ’2013లో జరిగిన టోర్నీలో మేం కనీసం సూపర్‌ సిక్స్‌కు కూడా అర్హత సాధించలేదు. అప్పుడు నేను చాలా నిరాశ చెందాను. 2017లో ప్రయత్నిద్దాం అనుకున్నాను. ఓ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా చాలా కష్టపడ్డాను. అందుకే ఫైనల్లో గెలిచాక గుడ్‌బై చెబుదామనుకున్నా. అప్పుడు కూడా ఫలితం రాలేదు. అందుకే 2021లో మరో చాన్స్‌ తీసుకుందామనుకుంటున్నాను. అందరి ఆశీస్సులతో అప్పుడైనా విజేతగా నిలవాలని ఆశిద్దాం’ అని 37 ఏళ్ల మిథాలీ తెలిపింది. మరోవైపు మహిళల క్రికెట్‌ 2006లో కాకుండా మరో ఐదేళ్ల ముందే బీసీసీఐ కిందకు వచ్చుంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని అభిప్రాయపడింది. 

Advertisement
Advertisement
Advertisement