25 ఏళ్ల తరువాత గూగుల్ సెర్చ్‌లో... తనకు అవార్డ్ దక్కిన విషయం తెలుసుకున్న టాలెంటెడ్ యాక్ట్రస్!

బాలీవుడ్ సినిమాలు చూసేవారికి బాగా తెలిసిన ఫేస్... మీటా వశిష్ట్. ఎన్నో చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటనని కనబరిచింది. హీరోయిన్‌గా కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అయితే, ఆమె ఈ మధ్య చెప్పిన ఓ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనకు లభించిన ఒక అవార్డ్ గురించి తానే పాతికేళ్ల తరువాత తెలుసుకుందట! అది కూడా... మరేదో విషయం గురించి గూగుల్ చేస్తూ... అనుకోకుండా ఆన్‌లైన్‌లో చదివిందట!


లెటెస్ట్ ఇంటర్వ్యూ ఒకదాంట్లో, ‘‘అవార్డ్స్ ఫంక్షన్స్ వేదికలపై... మీ ప్రతిభకు తగిన గుర్తింపు మరింతగా రావాలని మీరు కోరుకుంటున్నారా?’’ అనే ప్రశ్న ఎదురైంది మీటా వశిష్ట్‌కి. దానికి ఆమె, ‘‘నాట్ రియల్లీ’’ అంటూ కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. 1990లో ‘దృష్టి’ అని సినిమా చేసింది మీటా. అందులో ఆమె హీరోయిన్ డింపుల్ కపాడియాకు ఫ్రెండ్. కానీ, ‘దృష్టి’ సినిమా విడుదలైన తరువాత దాదాపు 25 ఏళ్లకు మరేదో విషయమై గుగూల్ సెర్చ్ చేసిందట సీనియర్ యాక్ట్రస్. అప్పుడు ఆమెకు అనుకోకుండా అదే సినిమాకుగానూ ‘ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‘ వారు అప్పట్లో ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్‌‘ అవార్డ్ ప్రకటించారని తెలిసిందట! ఆ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ క్యారెక్టర్ చేసింది... మీటా వశిష్టే!


అటుఇటుగా మూడు దశాబ్దాల క్రితం తనకు లభించిన అవార్డ్ గురించి ఇఫ్పుడు వివరించిన 54 ఏళ్ల సీనియర్ నటి పురస్కారాలు పెద్ద ప్రధానం కాదని చెబుతోంది. ఏ ఒక్క సినిమా లేదా ఏ ఒక్క పాత్ర గురించో జనం మాట్లాడుకోవటం విశేషం అనిపించుకోదని మీటా అభిప్రాయపడింది. ‘‘మన ప్రతీ సినిమా కొన్ని సంవత్సరాల తరువాత కూడా జనం చర్చల్లో ఉండటమే ప్రధానం...’’ అందామె.      

Advertisement

Bollywoodమరిన్ని...