ఆరోగ్య సేతుకు ఎంఐటీ షాక్‌

ABN , First Publish Date - 2020-05-23T07:48:36+05:30 IST

భారత్‌లో కరోనా సంక్రమణాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య సేతు యాప్‌నకు మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) షాక్‌ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఎంఐటీ...

ఆరోగ్య సేతుకు ఎంఐటీ షాక్‌

  • రేటింగ్‌ ఒక స్టార్‌కు కుదింపు


న్యూఢిల్లీ. మే 22: భారత్‌లో కరోనా సంక్రమణాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య సేతు యాప్‌నకు మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) షాక్‌ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఎంఐటీ, ఆరోగ్యసేతుకు ఐదు స్టార్ల రేటింగ్‌కు గాను, కేవలం ఒకే ఒక్క స్టార్‌ను ఇచ్చింది. ఈ యాప్‌ అవసరమైనదానికంటే ఎక్కువగా వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తోందని ఎంఐటీ తేల్చి చెప్పింది. గత వారం వరకూ.. ఆరోగ్య సేతుకు రెండు స్టార్ల రేటింగ్‌ ఉండగా.. ఎంఐటీ పరిశోధకులు తాజాగా ఆ రేటింగ్‌  ఒక స్టార్‌కు కుదించేశారు.


పారదర్శకత లోపిం చడం, యాప్‌ డౌన్‌లోడ్‌ తప్పనిసరి చేయడం, సమాచారం ఎవరితో పంచుకుంటున్నారన్నది వెల్లడిం చకపోవడం.. ఇలా పలు కారణాల రీత్యా ఈ రేటింగ్‌ ఇచ్చినట్లు ఎంఐటీ వివరించింది. విమానయానం చేసే వారు కచ్చితంగా ఆరోగ్యసేతు డౌన్‌లోడ్‌ చేసుకో వాల ని తాజాగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-05-23T07:48:36+05:30 IST