‘మిస్టర్‌ కోనసీమ’ రాజేష్‌

ABN , First Publish Date - 2021-01-14T07:09:46+05:30 IST

కోనసీమ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌, హెల్త్‌-ఫిట్‌నెస్‌జిమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజిక్‌ మోడలింగ్‌ పోటీల్లో డి.రాజేష్‌ ‘మిస్టర్‌ కోనసీమ’ టైటిల్‌ను దక్కిం చుకున్నాడు.

‘మిస్టర్‌ కోనసీమ’ రాజేష్‌
మిస్టర్‌ కోనసీమ టైటిల్‌ విన్నర్‌ రాజేష్‌కు ట్రోఫీని అందజేస్తున్న దృశ్యం

అమలాపురం టౌన్‌, జనవరి 13: కోనసీమ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌, హెల్త్‌-ఫిట్‌నెస్‌జిమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజిక్‌ మోడలింగ్‌ పోటీల్లో డి.రాజేష్‌ ‘మిస్టర్‌ కోనసీమ’ టైటిల్‌ను దక్కిం చుకున్నాడు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలను కమిష నరు వి.అయ్యప్పనాయుడు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జాతీయ క్రీడాకారుడు కుడుపూడి సూర్యనారాయణరావు హాజరయ్యారు. విజేతలను బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ అధ్య క్షుడు వంటెద్దు వెంకన్నాయుడు, కోనసీమ అసోసియేషన్‌ అధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి ప్రకటిం చారు. అమలాపురం పట్టణానికి చెందిన రాజేష్‌ మిస్టర్‌ కోనసీమ టైటిల్‌ను దక్కించుకోగా ముఖ్య అతిథులు ట్రోఫీని అందజేశారు. మోడలింగ్‌ పోటీల్లో ఎం.నాని (రావులపాలెం) ఛాంపియన్‌గా నిలిచాడు. వారిద్దరికీ రూ.10,116 చొప్పున నగదు బహుమతిని అందజేశారు. న్యాయనిర్ణేతలుగా ఫిజికల్‌ డైరెక్టర్లు దొమ్మేటి వెంకటరమణ, కరాటం రవిసుధీర్‌, కొప్పిశెట్టి వాసు, వై.కుమార్‌, సీహెచ్‌ రాజబాబు, కేడీ ప్రసాద్‌ వ్యవహరించారు. విజేతలకు గారపాటి చంద్రశేఖర్‌, ఆశెట్టి ఆదిబాబు, చెల్లుబోయిన శ్రీను, బాబి, రమణ, కిరణ్‌కుమార్‌ బహుమతులు అందజేశారు. 



Updated Date - 2021-01-14T07:09:46+05:30 IST