వలస కార్మికులకు తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2020-05-11T11:34:33+05:30 IST

వలస కార్మికుల ను స్వంతరాష్ట్రాలకు తరలించటానికి కేంద్ర ప్ర భుత్వం అనుమతులిచ్చినా రెడ్‌ జోన్‌ పరిధిలో ఉన్న వారు వెళ్ళడానికి అనుమతులులేవని కోవిడ్‌- 19 అధికారులు స్ప ష్టం చేస్తున్నారు.

వలస కార్మికులకు తప్పని తిప్పలు

ప్రొద్దుటూరు అర్బన్‌, మే 10:  వలస కార్మికుల ను స్వంతరాష్ట్రాలకు  తరలించటానికి  కేంద్ర ప్ర భుత్వం అనుమతులిచ్చినా రెడ్‌ జోన్‌ పరిధిలో ఉన్న వారు వెళ్ళడానికి అనుమతులులేవని కోవిడ్‌- 19 అధికారులు స్ప ష్టం చేస్తున్నారు. దీంతో వేలాది మంది కార్మికుల ఆశలు అడిఆశలై ఆవేదనకు గురవుతున్నారు.  జిల్లాలోని ప్రొద్దుటూరులో దాదాపు రెండు వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వల స వచ్చిన కార్మికులు పలురకాల పనుల్లో జీవనోపాధి పొందుతున్నారు. వారంతా మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ,బీహార్‌,పశ్చిమబెంగాల్‌, ఒడిస్పా, జార్ఖండ్‌, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల వారు. లాక్‌డౌ న్‌తో 45 రోజులుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమను స్వంత రాష్ట్రాలకు వెళ్ళడానికి వెంటనే అనుమతులు ఇవ్వా లని వేడు కుంటున్నారు.


కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడా నికి అంగీకరించడంతో ఆన్‌లైన్‌లోను. స్వయంగాను కోవిడ్‌-19 అధికారులకు దరఖాస్తు చేసుకున్నా రెడ్‌ జోన్‌ నుంచి మరెక్కడికి అనుమతించేందుకు వీలు కాదని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈనెల 3వ తేది నుంచి  ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ద్వారా 466 మంది దర ఖాస్తు చేసుకోగా స్వయంగా 1500 మంది వలస కార్మికులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులను పరిశీలించి వారికి సొంత వాహనాలు ఉన్నాయా? ప్రభుత్వ వాహనాల్లో తరలించాలా? అని ప్రభుత్వానికి నివేదిక పం పుతామని తహసీల్దారు చండ్రాయుడు తెలిపారు,రెడ్‌ జోన్‌ నుంచి వారు వెళ్లే ప్రాంతాలు ఏ జోన్‌ లో వున్నాయో  పరిశీలించాల్సి వుంటుందన్నారు. వారి జాబితాను ప్రభుత్వానికి పంపుతామని అక్కడి నుంచి ఆదేశాలు వస్తే తప్ప వారిని పంపడం సాధ్యపడదన్నారు.

Updated Date - 2020-05-11T11:34:33+05:30 IST