తప్పు చేస్తే తొలగిస్తా!
ABN , First Publish Date - 2021-05-11T14:34:43+05:30 IST
మంత్రులు తమ శాఖల్లో తప్పు చేస్తే పదవి నుంచి తొలగిస్తానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్ మాట్లా డుతూ,
- మంత్రులకు సీఎం స్టాలిన్ హెచ్చరిక
చెన్నై: మంత్రులు తమ శాఖల్లో తప్పు చేస్తే పదవి నుంచి తొలగిస్తానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్ మాట్లా డుతూ, పదేళ్ల అనంతరం డీఎంకేకు ప్రజలు అవకాశం కల్పించారని, దీనిని దృష్టిలో వుంచుకొని మంచి పాలన అందించేలా మంత్రులు కృషిచేయాల న్నారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ల్లోని నియోజకవర్గాల్లో సమస్యలుంటే సత్వరం తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పలువురు ఎమ్మెల్యేలకు పదవులు దక్కని నేపథ్యంలో, మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తమ తమ శాఖల పనితీరుపై మంత్రులు అధ్యయనం చేసి, పూర్తి వివరాలతో సిద్ధం కావాలన్నారు.