వేసవిలో నీటి కొరత రాకుండా మిషన్ భగీరధ శాఖ ప్రణాళిక

ABN , First Publish Date - 2022-03-17T00:56:52+05:30 IST

వేసవి కాలం ప్రారంభం కావడంతో ముందు ముందు రాష్ట్రంలో నీటి కొరత రాకుండా చూసేందుకు మిషన్ భగీరధ శాఖ వేసవి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

వేసవిలో నీటి కొరత రాకుండా మిషన్ భగీరధ శాఖ ప్రణాళిక

హైదరాబాద్: వేసవి కాలం ప్రారంభం కావడంతో ముందు ముందు రాష్ట్రంలో నీటి కొరత రాకుండా చూసేందుకు మిషన్ భగీరధ శాఖ వేసవి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అటవీ ప్రాంతాల్లో ఉండే ఆవాసాలకు అంతరాయం లేకుండా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. బుధవారం ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈఎన్సీ క్రిపాకర్ రెడ్డి, ఈ హేరకు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, ఈఈలకు దిశానిర్ధేశం చేశారు. రిజర్వాయర్లలో నీటినిల్వలు సరిపోయేంత ఉన్నాయన్న ఈ ఎన్సీ రాబోయే మూడు నెలలు మిషన్ భగీరథలోనిప్రతి ఇంజనీర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. 


ఇంటెక్ వెల్స్, ట్రీట్ మెంట్ ప్లాంట్లలోని పంపిగ్ స్టేషన్లను ఈఈ స్దాయి అధికారులు తరచూ పరిశీలించాలని ఆదేశించారు. మోటార్లు, పంపులకు ఏమైనా మరమ్మతు సమస్యలు ఉంటే వెంటనే సరి చేయాలన్నారు. దీంతో పాటు భగీరథ పైప్లైన్ వ్యవస్ధ, ఎయిర్ వాల్వ్ ల తనీఖీ ప్రక్రియ నిరంతరం జరగాలన్నారు. ఎలక్ర్టో మెకానికల్ సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల ఆవాసాలకు జరిగే నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-03-17T00:56:52+05:30 IST