వదినతో యువకుని ప్రేమ వ్యవహారం.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎంత దారణానికి పాల్పడ్డాంటే..

ABN , First Publish Date - 2022-02-08T05:49:16+05:30 IST

అత్తారింటికి వెళ్లిన తమ కూతురు కనబడడం లేదంటూ.. పోలీసులకు మిస్సింగ్ యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతి అత్తారింటికి విచారణ కోసం వెళ్లగా.. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. మిస్సింగ్ యువతి భర్త, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్(పోలీసు కుక్కల) సహాయంతో మిస్సింగ్ యువతి శవాన్ని...

వదినతో యువకుని ప్రేమ వ్యవహారం.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎంత దారణానికి పాల్పడ్డాంటే..

అత్తారింటికి వెళ్లిన తమ కూతురు కనబడడం లేదంటూ.. పోలీసులకు మిస్సింగ్ యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతి అత్తారింటికి విచారణ కోసం వెళ్లగా.. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. మిస్సింగ్ యువతి భర్త, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్(పోలీసు కుక్కల) సహాయంతో మిస్సింగ్ యువతి శవాన్ని కనుగొన్నారు. ఆ శవం ముక్కలు ముక్కులుగా నరికి.. నది తీరాన భూమిలో లభించింది. ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని బంకా జిల్లా తాహిర్ పూర్‌కు చెందిన రీమా దేవి అనే యువతి కనబడడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా రీమా దేవి భర్త ఆమెతో గొడవపడేవాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రీమా దేవి అత్తరింటికి దర్యాప్తు కోసం వెళ్లగా.. ఆమె భర్త హేమంత్ యాదవ్.. మిగతా కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు రీమా దేవి మిస్సింగ్ కేసులో డాగ్ స్క్వాడ్ ఆపరేషన్ మొదలు పెట్టారు.


డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు నదీ తీరాన ఒక శవం భూమిలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆ శవం ముక్కలు ముక్కలుగా నరికి.. ఆ తరువాత భూమిలో పాతబెట్టినట్లు పోలీసులు తెలిపారు. నదీ తీరాన ఒక శవం చూడడానికి గ్రామ ప్రజలందరూ గుంపులుగా వచ్చారు. ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది.


పోలీసుల కథనం ప్రకారం.. రీమా దేవి భర్త అయిన హేమంత్ యాదవ్‌కు తన వదినతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం రీమా దేవికి తెలిసిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తరువాత ఒక రోజు హేమంత్ యాదవ్ తన భార్య రీమా దేవిని హత్య చేశాడు. ఆమె మృత దేహాన్ని అతను ముక్కలు ముక్కలుగా నరికి నదీ తీరాన భూమిలో పాతిపెట్టాడు.


తన భర్త అక్రమ సంబంధం గురించి రీమా దేవి తన తల్లిదండ్రలకు కూడా చెప్పిన కొన్ని రోజుల నుంచి ఆమె కనబడకుండాపోయింది. రీమా దేవి తల్లదండ్రులు హేమంత్ కుమార్‌ను తమ కూతురి గురించి ప్రశ్నించగా.. ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు బుకాయించాడు. దీంతో వారు రీమా దేవి కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ప్రస్తుతం పోలీసులు రీమా దేవి హత్యకేసులో నిందితులైన హేమంత్ యాదవ్, అతని కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2022-02-08T05:49:16+05:30 IST