bjp ఎంపీ, ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు

ABN , First Publish Date - 2022-04-25T12:46:13+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బీజేపీ ఎంపీ జాన్ బార్లా, ఎమ్మెల్యే దీపక్ బర్మాన్ మిస్సింగ్ పోస్టర్లు వెలిశాయి...

bjp ఎంపీ, ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బీజేపీ ఎంపీ జాన్ బార్లా, ఎమ్మెల్యే దీపక్ బర్మాన్ మిస్సింగ్ పోస్టర్లు వెలిశాయి. అలీపుర్‌దువార్‌లో ఎంపీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జాన్ బార్లా, ఫలకాటా ఎమ్మెల్యే దీపక్ బర్మాన్ అదృశ్యానికి సంబంధించిన పోస్టర్లను టీఎంసీ కార్యకర్తలు అతికించడం సంచలనం రేకెత్తించింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ ఫిర్యాదు కూడా చేశారు.ఆ పోస్టర్లలో ఇద్దరు బీజేపీ నేతల చిత్రం ఉందని, వారిద్దరినీ వెతకాల్సిన అవసరం ఉందని రాసి ఉంది.‘‘ గతంలో అలీపుర్‌దువార్‌లో తుపాన్ కారణంగా అపార నష్టం జరిగింది. ఇంత పెద్ద ప్రకృతి వైపరీత్యం జరిగినా ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ ఈ ప్రాంతాన్ని సందర్శించలేదు’’ అని టీఎంసీ నాయకుడు శుభబ్రత డే ఆరోపించారు. 


కాగా బీజేపీ ఎమ్మెల్యే దీపక్ బర్మన్ ఈ ఆరోపణలను ఖండించారు.తుపాన్ వచ్చినప్పుడు తాను కోల్‌కతాలో ఉన్నానని ఎమ్మెల్యే బర్మన్ చెప్పారు. సంఘటన స్థలాన్ని సందర్శించి ఆ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని పరిశీలించానన్నారు. తాను డీఎంకు లేఖ రాశానని, ఎమ్మెల్యే ఖాతా నుంచి నష్టాన్ని భర్తీ చేయాలని కోరానని ఇంకా సమాధానం రాలేదని బర్మన్ చెప్పారు.టీఎంసీ నీచ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది.

Updated Date - 2022-04-25T12:46:13+05:30 IST