Missing Parrot Found: తప్పిపోయిన చిలుకను పట్టి అప్పగించాడు.. ఏకంగా రూ.85 వేల నజరానా అందుకున్నాడు!

ABN , First Publish Date - 2022-07-24T20:57:42+05:30 IST

`మీరు మా చిలుక (Parrot)ను ఎక్కడైనా చూశారా?`, `దాని పట్టుకుని ఇచ్చిన వారికి రూ.50 వేలు నజరానాగా ఇస్తాం`

Missing Parrot Found: తప్పిపోయిన చిలుకను పట్టి అప్పగించాడు.. ఏకంగా రూ.85 వేల నజరానా అందుకున్నాడు!

`మీరు మా చిలుక (Parrot)ను ఎక్కడైనా చూశారా?`, `దాని పట్టుకుని ఇచ్చిన వారికి రూ.50 వేలు నజరానాగా ఇస్తాం` అంటూ కర్ణాటక(Karnataka) లోని తముకూరులో పోస్టర్లు అంటించిన వ్యక్తి శ్రమ ఫలించింది. తప్పిపోయిన అతని చిలుక దొరికేసింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిలుకను పట్టి ఇచ్చిన వ్యక్తికి ముందు చెప్పినట్టు రూ.50 వేలు కాకుండా.. ఏకంగా రూ.85 వేలు బహుమతిగా ఇచ్చాడు. కర్ణాటకలోని తముకూరుకు చెందిన వ్యాపారి అర్జున్ ఆఫ్రికా నుంచి రెండు చిలుకలను తెచ్చి పెంచుకుంటున్నాడు. వాటికి `రుస్తుం`, `రిస్తా` అని పేర్లు పెట్టాడు. 


ఇది కూడా చదవండి..

Parrot Missing: చిలుక తప్పిపోయిందట.. వెతికి తీసుకొస్తే రూ.50 వేల నజరానా ఇస్తారట..!


ఈ నెల 16న రుస్తుమా అదృశ్యమైంది. దీంతో అర్జున్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దాని ఆచూకీ తెలుసుకోవడం కోసం అర్జున్ కుటుంబం లక్షన్నర రూపాయలు ఖర్చుపెట్టింది. దాదాపు 30 వేల పాంప్లేట్లు వేసి నగరం అంతా పంచిపెట్టారు. చిలుకను పట్టి ఇచ్చిన వారికి రూ.50 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అర్జున్ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో నీరసించిపోయిన స్థితిలో ఉన్న రుస్తుం.. శ్రీనివాస్‌ అనే వ్యక్తికి  కనిపించింది. 


శ్రీనివాస్ ఆ చిలుకను ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేయడంతో అది కోలుకుంది. ఈ లోగా తన దగ్గర ఉన్న చిలుక ఆచూకీ కోసం అర్జున్ కుటుంబం వెతుకుతోందనే విషయం శ్రీనివాస్‌కు తెలిసింది. దీంతో శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం రుస్తుంను తీసుకొని అర్జున్ ఇంటికి వెళ్లాడు. శ్రీనివాస్ తెచ్చిన చిలుకను చూసి అర్జున్ కుటుంబం ఎగిరి గంతేసింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముందుగా ప్రకటించినట్టు రూ.50 వేలు కాకుండా రూ.85 వేలు శ్రీనివాస్‌‌కు నజరానాగా ఇచ్చారు. కాగా, ఇన్ని రోజులు ముభావంగా ఉన్న ఆడ చిలుక రిస్తా.. రుస్తుంను చూడగానే ఉత్సాహంగా మారింది. 

Updated Date - 2022-07-24T20:57:42+05:30 IST