కరీంనగర్: జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గన్నేరువరం మండలంలో భారీ వర్షం పడింది. దీంతో గన్నేరువరం మండలం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఒడ్డుకు చేర్చారు.