కీవ్‌ మిలటరీ వైమానిక కేంద్రాన్ని తాకిన రష్యా క్షిపణలు, రన్‌వే ధ్వంసం

ABN , First Publish Date - 2022-03-12T22:00:32+05:30 IST

ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా శనివారంనాడు దాడులు మరింత ఉధృతం చేసింది. బాంబుల మోత మోగిస్తూ..

కీవ్‌ మిలటరీ వైమానిక కేంద్రాన్ని తాకిన రష్యా క్షిపణలు, రన్‌వే ధ్వంసం

కీవ్: ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా శనివారంనాడు దాడులు మరింత ఉధృతం చేసింది. బాంబుల మోత మోగిస్తూ, క్షిపణులతోనూ విరుచుకుపడుతోంది. దక్షిణ కీవ్‌లోని ఓ మిలటరీ వైమానిక స్థావరాన్ని రష్యా క్షిపణులు తాకడంతో రన్‌వే ధ్వంసమైనట్టు వాసిల్కివ్ నగర మేయర్ తెలిపారు. దీనితో పాటు ఒక ఇంధన డిపో ధ్వంసమైందని, అమ్యునేషన్ స్టోర్‌లో కూడా పేలుళ్లు సంభవించాయని చెప్పారు. క్షిపణులు తాకడంతో ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్ముకున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఒక వీడియాల్లో కనిపిస్తోంది.


ఉక్రెయిన్ ఉత్తరాన ఉన్న చెర్నిహివ్‌ను కూడా రష్యా బలగాలు చుట్టుముట్టి బాంబుల మోత మోగిస్తున్నాయి. ఆ నగరంలో నీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్‌లో మూడవ అతిపెద్ద నగరమైన ఒడెస్సా‌లోనూ రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఒక కేన్సర్ ఆసుపత్రి కూడా తీవ్రంగా దెబ్బతింది. కాగా, మరియుపోల్‌లో అతిపెద్దదైన మసీదు బాంబుల తాకిడికి దెబ్బతిందని, ఇందులో పిల్లలు, వృద్ధులతో సహా 80 మంది తలదాచుకున్నారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది.

Updated Date - 2022-03-12T22:00:32+05:30 IST