తప్పిన ప్రమాదం!

ABN , First Publish Date - 2022-01-22T04:56:24+05:30 IST

అది 26వ నంబరు జాతీయ రహదారి. సాయంత్రం 4.30 గంటల సమయం. వాహనాల రద్దీ అధికంగా ఉంది. సరిగ్గా మరుపల్లి జంక్షన్‌, గుడివాడల మధ్య ప్రయాణిస్తున్న ఓ లారీకి మంటలు వ్యాపించాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు, వాహన చోదకులు భయంతో పరుగులు తీశారు. విశాఖ నుంచి చత్తీస్‌గడ్‌కు రసా

తప్పిన ప్రమాదం!
లారీ నుంచి వస్తున్న మంటలు


గజపతినగరం, జనవరి 21:అది 26వ నంబరు జాతీయ రహదారి. సాయంత్రం 4.30 గంటల సమయం. వాహనాల రద్దీ అధికంగా ఉంది. సరిగ్గా మరుపల్లి జంక్షన్‌, గుడివాడల మధ్య ప్రయాణిస్తున్న ఓ లారీకి  మంటలు వ్యాపించాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు, వాహన చోదకులు భయంతో పరుగులు తీశారు.  విశాఖ నుంచి చత్తీస్‌గడ్‌కు రసాయనాల లోడుతో వెళ్తున్న లారీ టైరు పేలడమే  ప్రమాదానికి కారణం. లారీ వెనుకభాగం కాలిపోయింది.గజపతినగరం అగ్నిమాపక అధికారి అప్పారావు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో గంట పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 



Updated Date - 2022-01-22T04:56:24+05:30 IST