Abn logo
Apr 17 2021 @ 00:29AM

అదుపుతప్పిన ప్రైవేటు బస్సు...

సోంపేట రూరల్‌ : బేసిరామచంద్రాపురం సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం ఓ ప్రైవేట్‌ బస్సు అదుపు తప్పింది. భువనేశ్వర్‌ నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఈ బస్సు బేసిరామచంద్రపురం వద్ద అదుపుతప్పి పొదల్లోకి దూసుకుపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఒక మహిళకు స్వల్ప గాయాలు కాగా, మిగిలిన 45 క్షేమంగా బయటపడ్డారు. బారువ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. Advertisement
Advertisement
Advertisement