వ్యాక్సిన్లతో తప్పిన మృత్యువు! భారత్‌లో నిలిచిన 42 లక్షల ప్రాణాలు

ABN , First Publish Date - 2022-06-25T17:37:12+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్ల వల్ల భారత్‌లో నిరుడు 42 లక్షల మరణాలను నివారించగలిగారు. లాన్సెట్‌ ప్రచురించిన ఓ అధ్యయనం

వ్యాక్సిన్లతో తప్పిన మృత్యువు! భారత్‌లో నిలిచిన 42 లక్షల ప్రాణాలు

ప్రపంచంలో 2 కోట్ల మంది సేఫ్‌.. తాజా సర్వే


లండన్‌, జూన్‌ 24: కొవిడ్‌ వ్యాక్సిన్ల వల్ల భారత్‌లో నిరుడు 42 లక్షల మరణాలను నివారించగలిగారు. లాన్సెట్‌ ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్‌ ప్ర బలిన కాలంలో మరణాల రేటు ఆధారంగా 185 దేశాల్లో అధ్యయనం కొనసాగింది. వ్యాక్సినేషన్‌ చేపట్టిన తొలి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1.98 కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగారని అధ్యయనానికి నేతృత్వం వహించిన లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన ఆలివర్‌ వాట్సన్‌ చెప్పారు. భారత్‌లో అధికారిక లెక్కల ప్రకారం కొవిడ్‌ మరణాలు 5.24 లక్షలు. అయితే, అంతకు 10 రెట్లు మరణాలు సంభవించినట్టు అంచనాలున్నాయని.. వీటి ఆధారంగానే వ్యాక్సినేషన్‌తో ఎంతమంది ప్రాణాలు నిలిచాయన్న దానిపై గణాంకాలను రాబట్టామని చెప్పారు. భారత్‌లో కొవిడ్‌ సంబంధిత మరణాలు 47 లక్షలని డబ్ల్యూహెచ్‌వో గత నెల లో ప్రకటిస్తే.. భారత్‌ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్లు అన్ని దేశాల్లో సమానంగా పంపిణీ జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణా లు నిలిచేవని యేల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ అలిసన్‌ గల్వానీ చెప్పారు. అమెరికాలో 19 లక్షల మంది, బ్రెజిల్‌లో 10 లక్షలు, ఫ్రాన్స్‌లో 6.31 లక్షలు, బ్రిటన్‌లో 5.07 లక్షల మందిని వ్యాక్సిన్లు మృత్యుకోరల నుంచి తప్పించాయని పరిశోధకులు తెలిపారు. 2021 చివరికల్లా 40ు వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని ఛేదించి ఉన్నట్లయితే మరో 6 లక్షల మంది ప్రాణాలు నిలిచేవని అధ్యయనంలో వెల్లడైంది.

Updated Date - 2022-06-25T17:37:12+05:30 IST