Abn logo
Sep 22 2021 @ 23:55PM

గూడ్స్‌రైలుకు తప్పిన ప్రమాదం

కామారెడ్డి రైల్వేగేట్‌ సమీపంలో గూడ్స్‌ రైలు బోగీలకు సంబంధించి క్లిప్పింగ్స్‌ ఊడిపోవడంతో ఆగిన గూడ్స్‌ రైలు

బోగీల క్లిప్పింగ్స్‌ ఊడిపోవడంతో ఘటన
రైల్వే సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు


కామారెడ్డి, సెప్టెంబరు 22: కామారెడ్డిలోని రైల్వే గేటు సమీపంలో బుధవారం ఓ గూడ్స్‌ రైలు రెండుగా విడిపోగా.. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. వివరాల్లోకి వెళితే.. మధ్యాహ్నం వేళ గూడ్స్‌ రైలు నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు బయలుదేరింది. మార్గమధ్యలో కామారెడ్డి శివారులో గూడ్స్‌ రైలు బోగీలకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో రైలు ఇంజిన్‌తో పాటు బోగీలు రెండుగా విడిపోయాయి. గమనించిన లోకో పైలెట్‌ వెంటనే అప్రమత్తమై.. రైలును నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో సుమారు అర గంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత మరమ్మతులు చేయడంతో గూడ్స్‌ రైలు యధావిధిగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లింది. కాగా.. సంఘటన అటవీ ప్రాంతంలో జరిగితే పెను ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు తెలిపారు.