దండాలు.. మైసమ్మ తల్లో

ABN , First Publish Date - 2020-12-01T04:09:10+05:30 IST

కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

దండాలు.. మైసమ్మ తల్లో
మైసిగండి మైసమ్మ దేవత క్షీరాభిషేకం చేస్తున్న ఆలయ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు

  • మైసిగండిలో వైభవంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 
  • దేవతకు క్షీరాభిషేకం, కుంభ హారతి 
  • భారీగా తరలివచ్చిన భక్తులు 
  • కనులపండువగా కార్తీక దీపోత్సవం
  • ఉత్సవాలను ప్రారంభించిన ఆలయ ఫౌండర్‌ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ 


కడ్తాల్‌ : కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీకపౌర్ణమి మొదలు కార్తీక శష్ఠి వరకు ఏడు రోజుల పాటు కనులపండువగా కొనసాగే బ్రహ్మోత్సవాల కోసం మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. కొవిడ్‌ -19 నిబంధనలను అనుసరించి వసతులు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయాన్నే వేదపండితులు, బ్రాహ్మణులు, ఆలయ అర్చకులు సుప్రభాత సేవతో మైసమ్మ అమ్మవారికి మేలుకొల్పు పాడారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి స్నేహలతతో కలిసి ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రామావత్‌ శిరోలిపంతూ అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు సమర్పించారు. మైసమ్మ దేవత అమ్మవారి మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించి పూజ కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారి కలశంతో  మేళతాళాలు, బ్యాండువాయిద్యాల మధ్య ఆలయ ఆవరణలో ఊరేగింపు నిర్వహించారు. తొలిరోజు సోమవారం అమ్మవారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణ, కుంభహారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కుంభహారతి కార్యక్రమంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కడ్తాల ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ , వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ , మైసిగండి సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, ఆలయ నిర్వాహకుడు రామావత్‌ భాస్కర్‌ , మహేశ్వరం తహాసీల్దార్‌ ఆర్‌.పి.జ్యోతిఅరుణ్‌, మాదారం శేఖర్‌గౌడ్‌, శ్రీరాములు గౌడ్‌, బీచ్యానాయక్‌, అమృనాయక్‌, పంత్యనాయక్‌, జవహార్‌లాల్‌ నాయక్‌, రాందాస్‌ నాయక్‌, తులసీరామ్‌ నాయక్‌, శ్రీనివా్‌సరెడ్డి, చాట్ల వెంకటేశ్‌, కిషన్‌, ప్రవీణ్‌, రెడ్యనాయక్‌, హీరాసింగ్‌, యాదగిరి, రాధాకృష్ణ , సంతోష్‌, భాను, ఎమ్‌. రాజు, అమూళ్యపతి, ఆనంద్‌, వెంకటరమణ, ఆలయ సిబ్బంది, తహాసీల్దార్‌ అనిత,  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T04:09:10+05:30 IST