కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు

ABN , First Publish Date - 2021-02-25T07:47:54+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు విడనాడి.. పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ టీకా వేయించుకోవాలని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పిలుపునిచ్చారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు
టీకా వేయించుకుంటున్న వెంకట అప్పలనాయుడు

అందరూ టీకా వేయించుకోండి

తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు


తిరుపతి (నేరవిభాగం), ఫిబ్రవరి 24: కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు విడనాడి.. పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ టీకా వేయించుకోవాలని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బందిలో వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలు, భయాన్ని పోగొట్టడానికి బుధవారం స్విమ్స్‌ ఆస్పత్రిలో ఆయన టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకుని జిల్లా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎస్పీతోపాటు పరిపాలనా విభాగం అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీలు నరసప్ప (వెస్ట్‌), మురళీకృష్ణ (ఈస్ట్‌), మల్లికార్జున (ట్రాఫిక్‌), కొండయ్య (కమాండ్‌ కంట్రోల్‌) తదితర అధికారులు కూడా వ్యాక్సిన్‌ వేసుకున్నారు. 

Updated Date - 2021-02-25T07:47:54+05:30 IST