IT కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు అడిగిన దుండగులు.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-09-25T21:12:17+05:30 IST

రాజస్థాన్‌ (Rajasthan)లోని భిల్వారాకు చెందిన ఓ ఐటీ కంపెనీ యజమానిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు..

IT కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు అడిగిన దుండగులు.. చివరకు ఏమైందంటే..

రాజస్థాన్‌ (Rajasthan)లోని భిల్వారాకు చెందిన ఓ ఐటీ కంపెనీ యజమానిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు.. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.. కేవలం రెండు గంటల్లో ఆ దుండగులను పోలీసులు అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని విడిపించారు.. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం భిల్వారాలో చోటుచేసుకుంది.


ఇది కూడా చదవండి..

Viral Video: రద్దీ రోడ్డుపై బైక్‌తో వెరైటీ స్టంట్స్.. పోలీసుల కంటపడిన వైరల్ వీడియో.. చివరకు అతడి పరిస్థితి ఎలా తయారయిందంటే..


భిల్వారాలోని శాస్త్రి నగర్‌లో నివాసం ఉండే 42 ఏళ్ల లలిత్ కుమార్ కృపలానీ ఐటీ కంపెనీ యజమాని. అతను శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేసేందుకు ఆఫీసు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. సోని హాస్పిటల్ సమీపంలో ఆయన బైక్‌ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఐదుగురు దుండగులు కారు నుంచి దిగి లలిత్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటలకు లలిత్ తండ్రి రమేష్‌కు ఫోన్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిపై నిఘా పెట్టారు. 


దాదాపు 2 గంటల్లో కడుకోట్ సమీపంలో దుండగుల కారును పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు దుండగులు పోలీసులకు దొరికిపోగా, ఇద్దరు తప్పించుకున్నారు. పోలీసులు ఆ ముగ్గురినీ స్టేషన్‌కు తరలించారు. వారిని ప్రశ్నించి లలిత్ ఆచూకీ తెలుసుకుని విడిపించారు. పరారీలో ఉన్న ఇద్దరు దుండగుల కోసం పోలీసులు  గాలిస్తున్నారు.

Updated Date - 2022-09-25T21:12:17+05:30 IST