Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 04 Dec 2021 16:57:02 IST

అరుదైన ఘనత సాధించిన మీర్జాపూర్ వెబ్‌సిరీస్

twitter-iconwatsapp-iconfb-icon
అరుదైన ఘనత సాధించిన మీర్జాపూర్ వెబ్‌సిరీస్

అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే మీర్జాపూర్ వెబ్ సిరీస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆ షో ప్రారంభం కాగానే అమెజాన్‌కు చందాదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. షో కోసమే ఓటీటీని సబ్‌స్ర్కైబ్ చేసుకుంటున్నారంటే మీర్జాపూర్ సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ అరుదైన ఘనత సాధించింది. 

   

మీర్జాపూర్ సీజన్ -2 కు ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్‌లో టాప్ షోగా ఈ వెబ్‌సిరీస్ పురస్కారం పొందింది. సింగపూర్‌లో డిసెంబర్ 2, 3 వ తేదీల్లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ‘‘  మేం అన్ని రకాల కథలను ప్రేక్షకులకు అందిచాలనుకుంటున్నాం. ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కంటెంట్‌ను రూపొందిస్తున్నాం. భారత్‌లో మేం అడుగుపెట్టి 5ఏళ్లు పూర్తి అయింది. మంచి కథలు చెబుతున్నందుకు ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్‌లో మాకు పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నటుడు బ్రహ్మా స్వరూప్ మిశ్రాను నేను గుర్తు చేసుకుంటున్నాను. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో లలిత్ అనే పాత్రను అతడు షోషించాడు. గతవారంలో అతడు మరణించాడు.  మీర్జాపూర్‌ వెబ్‌సిరీస్ బృందానికి ఈ అవార్డును అంకితమిస్తున్నాను ’’ అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్ చెప్పింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement