ప్లాస్టిక్‌ రహిత కేంద్రంగా అద్దంకి

ABN , First Publish Date - 2022-05-25T05:58:43+05:30 IST

ప్లాస్టిక్‌ రహిత అద్దంకిగా మార్చేం దుకు ప్రతిఒక్కరూ సహకరించాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

ప్లాస్టిక్‌ రహిత కేంద్రంగా అద్దంకి
మొక్కజొన్న కండెలతో తయారు చేసిన క్యారీ బ్యాగ్‌లు, ఇతర వస్తువులను పరిశీలిస్తున్న కృష్ణచైతన్య

ఆ దిశగా ప్రతిఒక్కరూ సహకరించాలి

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

అద్దంకి, మే 24: ప్లాస్టిక్‌ రహిత అద్దంకిగా మార్చేం దుకు ప్రతిఒక్కరూ సహకరించాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. అద్దంకి పట్టణంలో జూన్‌ ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర ప్లాస్టిక్‌ సంబంధిత వస్తువుల అ మ్మకాలు, వినియోగం పూర్తిగా నిషేధిస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న కండెలతో తయారుచేసిన క్యారీ బాగ్‌లు, ఇత ర వస్తువులను స్థానిక నగరపంచాయతీ కార్యాలయం ఆ వరణలోని ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసి న ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ కవర్లు వినియోగం విరమించుకోవాలని, ప్రత్యామ్నాయ ఉత్పత్తులను విని యోగించుకోవాలన్నారు. 

20వ  వార్డులోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కృష్ణచైతన్య పరిశీలించారు. పౌష్టికాహారం సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమాల లో చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ,  వైస్‌ చైర్మన్‌లు పద్మేష్‌, అనంతలక్ష్మి, కమిష నర్‌ ఫజులుల్లా, వైసీపీ పట్టణ  అధ్యక్షుడు కాకాని  రాధాకృష్ణమూర్తి, పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ సందిరెడ్డి రమేష్‌, గూడా శ్రీనివాసరెడ్డి, భువనేశ్వరి, కౌన్సిలర్‌లు, తదితరులు పాల్గొన్నారు.


పట్టణ అభివృద్ధికి కృషిచేయాలి

అద్దంకి పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్‌లు, వైసీపీ వార్డు ఇన్‌చార్జిలు కలిసికట్టుగా పనిచేయాలని కృష్ణచైతన్య సూచించారు. నగర పంచా యతీ కార్యాయంలోని కమిషనర్‌ చాంబర్‌లో కౌన్సిలర్‌లు, వైసీపీ వార్డు ఇన్‌చార్జ్‌లు, అధికారులతో కృష్ణచైతన్య అంతర్గతంగా సమావేశం నిర్వ హించారు. పలువురు కౌన్సిలర్‌లు, చైర్‌ పర్సన్‌, కమిషనర్‌ల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఎవరి  వాదనలు వారు వినిపించటంతో పాటు  అభివృద్ది పనుల నిధుల కేటాయింపు విషయంలో తమ వార్డు లకు ఎక్కువ నిధులు కేటాయించాలని కొందరు కౌన్సిలర్‌లు పట్టుబ ట్టినట్లు సమాచారం. అదేసమయంలో నగర పంచాయతీలో పనిచేసే ఓ ఉద్యోగి మూడు నెలల నుంచి విధులకు హాజరుకాకుండా జీతం తీసుకుంటున్న విష యం, మరలా ఆ ఉద్యోగిని విధులలోకి తీసుకునే విషయంలో తీవ్రస్థాయిలో వాదన లు జరిగినట్లు తెలు స్తుంది. చైర్‌పర్సన్‌గా ఉన్న తనకు తెలియ కుండా ఉద్యోగికి జీ తం ఎలా చెల్లించాల రని, మరలా ఎలా విధులలోకి తీసుకుం టారని ఎస్తేరమ్మ ప్రశ్నించినట్లు సమాచారం.  

 

 అందరి సంక్షేమమే ధ్యేయం

మేదరమెట్ల, మే 24: ప్రజలందరికీ, సంక్షేమ ఫలాలు అందించేందు కు  సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు. మంగళవారం గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా కుర్రంవానిపాలెంలో ఇంటింటికి తిరిగి వారికి అందిన ప్రభుత్వ పథకాల గురించి కృష్ణచైతన్య అడిగి తెలుసు కున్నారు. అనంతరం నూతనంగా రూ.40 లక్షలతో నిర్మించిన సచివా లయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నాదెండ్ల దశరధరామయ్య, జడ్పీటీసీ తాళ్లూరి వెంకట రమణ, ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమారి, వైసీపీ  మండల కన్వీనర్‌ సాదినేని మస్తాన్‌రావు, భావన్నారాయణ, సతీష్‌, నాదెండ్ల ఆంజనేయులు (తెనాలి), తదితర నేతలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T05:58:43+05:30 IST