సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పాల్గొన్న కావటి మనోహరనాయుడు, యార్డు సభ్యులు
మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం
గుంటూరు(తూర్పు), జూన్29: తామరపురుగు వల్ల మిర్చి రైతులు నష్టపోతున్నారని, ఈ ఏడాది ప్రారంభం నుంచి తామరపురుగుపై అవగాహన సదస్సులు నిర్వహించాలని మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. మిర్చియార్డులో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామరపురుగు నుంచి మిర్చి పంటను కాపాడటానికి సరైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. యార్డుకు వచ్చే మిర్చి తడవకుండా టార్పాలిన్ పట్టలను ఏర్పాటు చేయాలని పాలకసభ్యులు నిర్ణయించారు. ఎక్స్‌ఫీషియో సభ్యుని హోదాలో హాజరైన నగర మేయర్ కావటి మనోహరనాయుడు మాట్లాడుతూ యార్డు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందన్నారు. యార్డులో రోడ్లు అభివృద్ధికి తగిన కార్యచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యార్డువైస్ చైర్మన్ ఎం.సుధాకరరెడ్డి, పాలకవర్గసభ్యులు, అధికారులు పాల్గొన్నారు.