Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిర్చి నారు కొని మోసపోయాం..ఆదుకోండి!

అధికారులకు కొల్లికూళ్ల రైతుల విజ్ఞప్తి

పెనుగంచిప్రోలు, డిసెంబరు 3: మండలంలోని కొల్లికూళ్ల గ్రామంలో 60 మంది రైతులు 45 ఎకరాల్లో సాగుచేసిన మిర్చి పూత, పిందె రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. ఓ కంపెనీ మిర్చి నారును నర్సరీల్లో కొనుగోలు చేసి సాగుచేశారు. శుక్రవారం సర్పంచ్‌ జొన్నలగడ్డ కిశోర్‌, సీపీఎం నేతలు గురవయ్య, నాగేశ్వరరావు ఆ పైర్లను పరిశీలించారు. అధికారులు తక్షణం పైర్లను పరిశీలించి, నర్సరీలు, కంపెనీల నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కోరారు.


Advertisement
Advertisement