Tokyo Olympics: స్వదేశం చేరుకున్న మీరాబాయి చాను

ABN , First Publish Date - 2021-07-27T00:00:09+05:30 IST

టోక్యో ఒలింపిక్స్ పతకధారి మీరాబాయి చాను స్వదేశం చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.

Tokyo Olympics: స్వదేశం చేరుకున్న మీరాబాయి చాను

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ పతకధారి మీరాబాయి చాను స్వదేశం చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. 27 ఏళ్ల మీరాబాయి ఎయిర్‌పోర్టులో కనిపించిన వెంటనే ‘భారత్ మాతా కీ’ జై అంటూ నినాదాలు మిన్నంటాయి. ఒలింపిక్స్ తొలి రోజే మీరాబాయి భారత్‌కు పతకాన్ని అందించింది. చాను గెలుపుతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఓ పతకం లభించింది.  


మణిపూర్‌కు చెందిన చాను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఎస్కార్ట్‌తో బయటకు వచ్చింది. ఇండియా ట్రైనింగ్ జెర్సీ ధరించిన చాను మెడలో రజత పతకం లేకపోవడం గమనార్హం. కాగా, ఫైనల్‌తో మీరాబాయితో తలపడి విజయం సాధించిన చైనా రెజ్లర్ డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయినట్టు తెలుస్తోంది. ఈ వార్తలే నిజమైతే చాను రజత పతకం కాస్త స్వర్ణంగా మారుతుంది. 

Updated Date - 2021-07-27T00:00:09+05:30 IST