టోక్యో: జపాన్ ఒలింపిక్స్‌లో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజత పకతం అందించిన మీరాబాయి చాను.. దేశానికి తొలి బంగారు పతకం అందించిన వెయిట్ లిఫ్టర్‌గా రికార్డులకెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కారణం.. ఫైనల్‌లో ఆమెను ఓడించిన చైనీస్ వెయిట్ లిఫ్టర్ ఝిహుయి హో డోపింగ్ టెస్టులో దొరికిపోయినట్టు సమాచారం. ఫైనల్ జరిగిన 2 రోజుల తర్వాత ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. డోపింగ్‌లో దొరికిపోవడంతో ఆమె నుంచి పసిడి పతకాన్ని ఉపసంహరించుకుని చానుకు ప్రదానం చేస్తారని చెబుతున్నారు. ఇంతకుమించిన వివరాలు తెలియరాలేదు. చాను కనుక పసిడి పతకం అందుకుంటే రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా చాను పేరు రికార్డులకెక్కుతుంది.