బెడ్రూం సీక్రెట్ల గురించి ఓ టాక్‌ షోలో ప్రశ్న.. మొహమాటం లేకుండా అసలు నిజాలు చెప్పిన Shahid Kapoor భార్య..

బాలీవుడ్ హాట్ కపుల్స్‌గా షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో మీరా అందంగా, గ్లామరస్‌గా అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు బోల్డ్‌గా మాట్లాడడంలోనూ మీరా బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. గతేడాది ఓ టాక్ షోకు హాజరైన మీరా.. వ్యాఖ్యాత అడిగిన హాట్ క్వశ్చన్‌కు ఏ మాత్రం తడబడకుండా సమాధానం చెప్పింది. 


హీరోయిన్ నేహా ధూపియా నిర్వహిస్తున్న ఓ టాక్ షోకు హాజరైన షాహిద్, మీరా ఆమె అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం నేహ.. బెడ్రూమ్ సీక్రెట్స్ గురించి అడిగింది. `శృంగారంలో ఏ భంగిమలో మీరు అత్యధికంగా సంతోషాన్ని అనుభవిస్తార`ని అడిగింది. ఆ ప్రశ్నకు షాహిద్ కాస్త ఇబ్బందిపడ్డాడు. అయితే మీరా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. `షాహిద్‌ది నియంత్రణ స్వభావం కలిగిన మనస్తత్వం. నేనేం చెయ్యాలో ఎప్పుడూ చెబుతూ ఉంటాడ`ని బోల్డ్‌గా సమాధానం చెప్పింది. మీరా సమాధానానికి షాహిద్ షాకయ్యాడు. 

Advertisement

Bollywoodమరిన్ని...